రోడ్డు ప్రమాదంలో దివాకర్ రెడ్డి మృతిపై నిరసన.. 50 మందిపై కేసు

రోడ్డు ప్రమాదంలో దివాకర్ రెడ్డి మృతిపై నిరసన.. 50 మందిపై కేసు

చేవెళ్ల, వెలుగు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ధర్నా చేసిన 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 3న పామెన గేట్ సమీపంలో టేర్ పేలి గాల్లోకి ఎగిరిన కారు.. మరో కారుపై పడడంతో చేవెళ్ల మండలం లక్ష్మీగూడకు చెందిన దివాకర్ రెడ్డి (25) మృతి చెందిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని మంగళవారం వారి బంధువులు, గ్రామస్తులు చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులకు ఇబ్బంది కలిగించినందుకు 50 మందిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.